లోన్ కోసం చూస్తున్నారు.. బ్యాంకులు తిరుగుతున్నారు.. కానీ ఎక్కడ ఇవ్వడం లేదు.. ఎలా చెయ్యాలో తెలియటం లేదు. అప్పుడే మీకు గుర్తొచ్చింది. మీ ఇంట్లో బంగారం ఉంది అని. ఆ బంగారాన్ని బ్యాంకులో పెట్టి లోన్ తీసుకోవాలి అని. అయితే ఏ బ్యాంకులో పెడితే అతి తక్కువ వడ్డీకి లోన్ వస్తుంది. అలా లోన్ రావాలి అంటే ఏం చెయ్యాలి? ఎక్కడ తక్కువకు వస్తుందో తెలుసుకోవాలి. 

 

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దేశ దిగ్గజ బ్యాంక్ అయినా ఎస్బిఐలో అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ ఇస్తున్నారు. ఆ బ్యాంకులో బంగారం పెట్టి ఏకంగా 20 లక్షల వరుకు రుణం తీసుకోవచ్చు. ఇక ఆర్బీఐ నిబంధనల ప్రకారం బంగారం విలువలో 75 శాతం వరుకు ఋణం ఇస్తారు. అయితే బంగారంపై రుణం తీసుకోవాలి అనుకుంటే కానీ 20వేలు తీసుకోవాలి. 

 

అయితే గోల్డ్ లోన్ పై వడ్డీ రేటు ఏడాది ఎంసీఎల్ఆర్‌కు 1.25 శాతం అధికంగా వడ్డీ రేటు పడుతుంది. అయితే ఇప్పుడు ఎస్బిఐ ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 7.85 శాతంగా ఉండగా దానికి 1. శాతాన్ని కలుపుకుంటే వడ్డీ రేటు 9.10 శాతంగా ఉంటుంది. అయితే ఎస్బిఐలో గోల్డ్ లోన్ తీసుకోడానికి పెద్దగా అర్హతలు ఉండల్సిన అవసరం లేదు.. కేవలం 18 ఏళ్లు దాటితే సరిపోతుంది. 

 

కాగా.. ఎస్బిఐలో బంగారంపై లోనే తీసుకోవాలి అని అని భావించే వారు కొన్ని కీలకమైనా డాక్యుమెంట్లు తీసుకెళ్లాలి. అవి ఏంటి అంటే.. అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్, రెండు ఆఫ్ ఫోటోలు ఉండాలి. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు వంటివి డాక్యుమెంట్లుగా ఉపయోగపడతాయి. అయితే గోల్డ్ లోన్ తీసుకున్న వారు 3 సంవత్సరాల్లో చెల్లించాల్సి ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: