బంగారంపై భారతీయులకు మక్కువ ఎక్కువ. అందుకే పెళ్లి, ప్రత్యేక సందర్భాలు, పండుగలు వచ్చినప్పుడు బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. దేశంలో పసిడి ధరలు పరుగులు పెట్టడంతో ఇటీవల కాలంలో బంగారం డిమాండ్ కొంత తగ్గిందని చెప్పచు. అయితే బంగారం ధరలు కొద్దీ రోజులుగా బాగా తగ్గుతూ వస్తున్నాయి. 

 

ఇటీవల కాలంలో అయితే బంగారం ధరలు ఒకరోజు పెరిగితే.. మరో రోజు తగ్గుతూ సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు బుధవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.. నేడు బుధవారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 40 రూపాయిల తగ్గుదలతో 42,600 రూపాయిలు చేరగా.. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 30 రూపాయిల తగ్గుదలతో 39,100 రూపాయలకు చేరింది. 

 

ఇంకా వెండి ధర కూడా భారీగా తగ్గింది. కేజీ వెండి ధర 53 రూపాయిల తగ్గుదలతో 48,947 రూపాయలకు చేరింది. ఇలా హైదరాబాద్ లో బంగారం ధరలు కొనసాగుతుండగా విజయవాడ, విశాఖపట్నంలో పసిడి, వెండి ధరలు ఇలాగె కొనసాగుతున్నాయి. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.30 తగ్గుదలతో 38,810 రూపాయలకు చేరింది. 

 

వెండి ధర రూ.49వేలకు చేరింది. విశాఖపట్నం మార్కెట్లోనూ ఇవే ధరలు నడుస్తున్నాయి. ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం 50 రూపాయిల తగ్గుదలతో 40,860 రూపాయిల వద్దకు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 60 రూపాయిల తగ్గుదలత రూ.39,700కు చేరింది. 

 

ఇక కేజీ వెండి ధర అక్కడ కూడా 49,000 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. అయితే బంగారంపై భారీ డిమాండ్ తగ్గటం వల్లే ఇలా బంగారం ధరలు తగ్గాయని అంటున్నారు మార్కెట్ నిపుణులు. మరి బంగారం ధరలు మరింత ఎప్పుడు తగ్గుతాయో చూడాలి. నిజానికి ప్రస్తుతం సామాన్యుల బంగారాన్ని కొనలేని పరిస్థితి ఏర్పడింది. మరి ఈ పరిస్థితి నుండి ఎప్పుడు బయటపడుతారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: