వాహనదారులకు తీపి కబురు. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు దిగి వస్తున్నాయి. వరుసగా నెల రోజుల నుండి కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు బుధవారం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 5 పైసలు తగ్గుదలతో 76.35 రూపాయిలకు చేరింది. 

 

అలాగే లీటర్ డీజిల్ ధర 7 పైసలు తగ్గుదలతో 70.35 రూపాయిల వద్దకు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర రూ.71.84 వద్ద, డీజిల్ ధర 5 పైసలు తగ్గుదలతో రూ.64.82కు చేరింది. ఆర్ధిక రాజధాని అయినా ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. 

 

పెట్రోల్ ధర 12పైసలు తగ్గుదలతో రూ.77.60 వద్దకు చేరింది. డీజిల్ ధర 5 పైసలు తగ్గుదలతో రూ.67.88కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా కదిలాయి. కాగా కేవలం నెల రోజుల్లో పెట్రోల్, డీజిల్ పై ఐదు రూపాయిలు తగ్గింది. ఏది ఏమైనా ఇది వాహనదారులకు ఇది మంచి తీపి కబురు అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: