మహిళ అంటేనే ఓ బాధ్యత.. మహిళలు కష్టపడినట్టు మరెవ్వరు కష్టపడరు.. మహిళలకు ఉన్న అన్ని బాధ్యతలు మరెవ్వరికీ ఉండవు.. అలాంటి మహిళలు తల్లి అయ్యాక మరిన్ని బాధ్యతలు పెరుగుతాయి. అలాంటి సమయంలో ఇంట్లో ఆర్ధిక పరిస్థితుల నుండి అన్ని విషయాలు దగ్గర ఉండి చూసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అలాంటి సమయంలో ఆర్ధికంగా వెనుకపడితే జీవనం చాలా కష్టం అవుతుంది. 

 

కానీ అమ్మ కానంత వరుకు బయట పనులు చేసిన తల్లి అమ్మ అయ్యాక బయట పనులు చెయ్యలేదు.. అలా అని ఆఫీస్ లో ఉండలేదు.. ఎంత ఉన్న ఇంట్లోనే ఉండాలి. ఎందుకంటే ఆ సమయంలో పిల్లలను చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి. ఇక పోతే ఆర్ధికంగా నిలబడాలి అంటే.. ఏదో ఒక పని చెయ్యాలి.. బయటకు వెళ్లి చెయ్యలేరు కాబట్టి ఇంట్లోనే చేసే పనులు చెయ్యాలి. అలాంటి గృహిణుల కోసం 5 అదిరిపోయే అద్భుతమైన బిజినెస్ ఐడియాలు మీకోసం. అవి ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

1. ఫుడ్ బిజినెస్.. ఈ బిజినెస్ ఎక్కడ చేసిన సరే అద్భుతంగా సెల్ అవుతుంది.. ఎందుకంటే ఇది ఎవర్ గ్రీన్ బిజినెస్. ఇంట్లోనే ఉండి చేసుకునే బిజినెస్. ఇప్పుడు బయట హోటల్స్ లో కల్తీ ఆహారం ఎక్కువ అవుతుంది.. ధర ఉంటుంది కానీ క్వాలిటీ ఉండటం లేదు. అందుకే ఇంట్లోనే క్వాలిటీ ఫుడ్ చేసి సర్వ్ చెయ్యండి.. మంచి పేరు.. మంచి లాభాలు అతి తక్కువ సమయంలోనే వస్తాయి. 


 
2. యోగ.. ఇది చెయ్యాలి అంటే.. మీకు యోగ వచ్చి ఉండాలి.. ఫిట్ గా ఉండాలి. అంతే.. ఇక ఈ యోగ కోసం ఎందరో వస్తారు.. మీరు ఒక గదిని అద్దంలా తీర్చిదిద్ది.. నీట్ గా పెట్టుకుంటే లావు ఉన్నవాళ్లు చాలామంది యోగ చెయ్యడానికి వస్తారు. ఇది మంచి బిజినెస్. 

 

3. హోమ్ క్లీనింగ్/ ల్యాండ్రీ.. ఇది మీకు కొంచం ఇబ్బంది గా అనిపించినా ఇది మంచి బిజినెస్.. ఇంట్లో ఒక రెండు వాషింగ్ మిషన్లు ఒక ఇద్దరు పని వారిని పెట్టుకొని ఈ లాండ్రి నడిపించేయచ్చు.. ఇప్పుడు ఉన్న మనుషులకు బట్టలు వాషింగ్ మిషన్ లో వేసే తీరిక కూడా లేదు. 

 

4. ఫ్యాషన్.. ప్రస్తుతం ఉన్న ఫ్యాషన్ వరల్డ్ కు.. మనం కొంచం కొత్తగా క్రియేటివ్ గా ఆలోచిస్తే ఆ మనం సంపాదించినంత సాఫ్ట్ వెర్ ఎంప్లాయ్ కూడా సంపాదించలేడు. అందుకే మహిళలు టైలరింగ్ బిజినెస్ ప్రారంభిస్తే మంచి లాభాలు ఉంటాయి. 

 

5. ట్యూషన్.. ఇంట్లోనే పిల్లలకు ట్యూషన్ చెప్పండి.. ఒక స్టూడెంట్ కు 2 గంటల సమయానికి 15 వందల నుండి 2వేల వరుకు ఫీజు తీసుకోండి. ఆలా ఒక్క సాయింత్రానికి మాత్రమే 2 గంటల సమయంలో మీరు 30మంది పిల్లలకు ట్యూషన్ పెట్టుకుంటే మీకు నెల తిరిగే సరికే నెలకు 60వేల వరుకు లాభం వస్తుంది. 

 

చూశారుగా.. ఇంట్లోనే ఉండి.. ఈ బిజినెస్ ఐడియాలు పాటించండి.. అధిక లాభాన్ని పొందండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: