నేడు శివరాత్రి.. ఎంతో అద్భుతమైన రోజు.. ఈరోజు కూడా బంగారం గట్టి షాక్ ఇచ్చింది అనే చెప్పాలి. ఎందుకంటే? బంగారం ధరలు అంతలా పెరిగిపోయాయి. నిజమే రోజు పెరుగుతాయి.. కానీ ఈరోజు మరింత ఎక్కువ పెరిగాయి. బంగారం ధరలు ఎంత పెరిగాయి అని అనుకుంటున్నారా? చుడండి మీరే.. 

 

 ఈ నేపథ్యంలోనే నేడు సోమవారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 260 రూపాయిల పెరుగుదలతో 42,420 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 150 రూపాయిల పెరుగుదలతో 39,800 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగింది. దీంతో నేడు కేజీ వెండి ధర 49,900 రూపాయిల వద్ద స్థిరంగా కొనసాగింది. 

 

అంతర్జాతీయంగా బంగారం, వెండి కొనుగోలుదారుల నుండి డిమాండ్ భారీగా పెరిగింది అని అందుకే బంగారంపై ఈ ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇలాగే కొనసాగుతున్నాయి. మరి ఈ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: