నిజంగా ఇది వాహనదారులకు ఒక అద్భుతమైనా వార్త అనే చెప్పాలి. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా.. రోజు రోజుకు తగ్గుతూ వస్తున్నాయి. ఆ పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు చూస్తే షాక్ అవ్వాల్సిందే.. అలా తగ్గాయి. అయితే గత రెండు రోజుల నుండి పెట్రల్, డీజిల్ ధరలు అటు పెరగకుండా.. ఇటు తగ్గకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే నేడు శుక్రవారం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 76.40 రూపాయిల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. అలాగే లీటర్ డీజిల్ ధర 70.45 రూపాయిల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర రూ.71.94 వద్ద, డీజిల్ ధర రూ.64.82 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. 

 

కాగా ఆర్ధిక రాజధాని అయినా ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర రూ.77.60 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర 5 పైసలు తగ్గుదలతో రూ.67.93కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా కదిలాయి. కాగా కేవలం నెల రోజుల్లో పెట్రోల్, డీజిల్ పై 5 రూపాయిలు తగ్గింది. భవిష్యత్తులో ఈ పెట్రోల్, డీజిల్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: