దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ అయినా ఎస్బిఐ తమ కస్టమరలకు ఎన్నో రకాల అద్భుతమైన సర్వీసులు ఇస్తుంది.. డబ్బులు భారీగా కట్ అయినా కూడా అత్యంత ఎక్కువ రుణాలు ఇస్తూ అదిరిపోయే సేవలను అందిస్తుంది. తక్కువ వడ్డీకి ఎక్కువ రుణాన్ని ఇస్తుంది ఎస్బిఐ. అయితే ఈ ఎస్బిఐ బ్యాంకు వినియోగదారులకు క్రెడిట్ కార్డ్స్ ను ఇస్తుంది. 

 

అయితే కార్డు వల్ల ఎన్నో లాభాలను కూడా ఇస్తుంది.. ఈ ఎస్బిఐ క్రెడిట్ కార్డు మూడు రకాల కార్డులను అందిస్తుంది. ఆ కార్డులు ఏంటి అంటే? లైఫ్‌స్టైల్ హోమ్ సెంటర్ ఎస్‌బీఐ కార్డు, మ్యాక్స్ ఎస్‌బీఐ కార్డ్, స్పార్ ఎస్‌బీఐ కార్డు అనేవి ఆ మూడు కార్డుల పేర్లు. కార్డు బట్టి లాభాలు ఉంటాయి.. వివిధరకాల ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఈ మూడు రకాల కార్డుల్లో కూడా మళ్లీ మూడు రకాల కార్డులు ఉంటాయి. 

 

అవి ఏంటి అంటే.. బేస్, సెలెక్ట్, ప్రైమ్ అనేవి ఆ మూడు రకాలు. మీ సంపాదన బట్టి ఆ కార్డ్స్ వస్తాయి. అయితే ఇవి వ్యాల్యూ ఫర్ మనీ దగ్గరి నుండి ప్రీమియం, సూపర్ ప్రీమియం కస్టమర్ల వరకు ఈ కార్డ్స్ ద్వారా ప్రయోజనం పొందొచ్చు. అయితే ఇప్పుడు ఏ కార్డుకు ఏ ప్రయోజనం అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

ప్రైమ్ వేరియంట్ క్రెడిట్ కార్డు తీసుకున్నవారికి సంవత్సరానికి రూ.30,000 వరకు ఆదా చేసుకోవచ్చని ఎస్‌బీఐ తెలిపింది. ఎస్‌బీఐ కొత్త క్రెడిట్ కార్డు తీసుకున్నవారికి ల్యాండ్‌మార్క్ రివార్డ్స్ ప్రోగ్రామ్‌కు కాంప్లిమెంటరీ లాయల్టీ మెంబర్‌షిప్ ఇస్తుంది. అంతేకాదు ఇతర కొనుగోళ్లపై రివార్డు పాయింట్లు కూడా ఇస్తుంది. రూ.100 ఖర్చు చేస్తే గరిష్టంగా 15 రివార్డు పాయింట్లు వస్తాయి. ఈ పాయింట్లను లైఫ్ స్టైల్.. మ్యాక్స్ వంటి షాపింగ్ మాల్స్ లో రీడిమ్ చేసుకోవచ్చు. ఇలా మీరు వాడే విధానం బట్టి మీరు క్రెడిట్ కార్డుతో లాభం పొందుతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: