అవును.. ఈ ధరలు చూశారు అంటే నిజంగానే బాబోయ్ అంటారు. అలా ఉన్నాయి బంగారం ధరలు. ఎందుకు ఇలా ఉన్నాయి అంటే ఏమి చెప్పలేము కానీ మధ్యతరగతి వారికీ అందనంత ఎత్తులో బంగారం ధరలు ఉన్నాయి.. ఈరోజు అయితే మరి దారుణంగా పెరిగిపోయి.. ఎంత దారుణంగా పెరిగాయి అంటే ? గతంలో ఎన్నడూ బంగారం ధరలు ఇంత పెరిగి ఉండవు.. ఏకంగా 900 రూపాయిలు పెరిగింది. 

 

ఈ నేపథ్యంలోనే నేడు ఆదివారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 990 రూపాయిల పెరుగుదలతో 44,420 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 910 రూపాయిల పెరుగుదలతో 40,720 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధర అదే బాట పట్టింది. దీంతో నేడు కేజీ వెండి ధర 1100 రూపాయిల పెరుగుదలతో 51,000 రూపాయిలకు చేరింది.  

 

అంతర్జాతీయంగా బంగారం, వెండి కొనుగోలుదారుల నుండి డిమాండ్ భారీగా పెరగటంతోనే బంగారంపై ఈ ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇలాగె కొనసాగుతున్నాయి. సామాన్యులకు అందనంత ఎత్తులో ప్రస్తుతం బంగారం ధరలు చేరాయి. మరి ఈ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో చూడాలి. ఏది ఏమైనా ఒకేసారి 41 వెయ్యి అంటే ఇక బంగారం ధరలు అసలు తగ్గేనా?

మరింత సమాచారం తెలుసుకోండి: