ఎల్ఐసి.. మనం మరణించాక మన నుండి కుటుంబం లాభ పడుతుంది అంటే అది కచ్చితంగా ఎల్ఐసి ద్వారానే.. అలాంటి ఎల్ఐసిలో అదిరిపోయే స్కీమ్స్ ఉన్నాయి. అయితే ఆ స్కీమ్స్ ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. దేశంలోనే దిగ్గజ బీమా కంపెనీ అయినా ఎల్‌ఐసీ ప్రజల కోసం ఎన్నో రకాల పాలసీలను అందిస్తోంది. 

 

ఆలా అందించిన స్కీమ్స్ లో ఎల్‌ఐసీ జీవన్ తరుణ్ పాలసీ ఒకటి.. ఈ పాలసీ అసలు ప్లాన్ అనేది మనీ బ్యాక్ ప్లాన్. అంటే.. మీరు ఎంత అయితే ఇన్వెస్ట్ చేస్తారో.. అది మళ్లీ వెనక్కి పొందే అవకాశం ఈ పాలసీ ఇస్తుంది. పిల్లల చదువు, వారి భవిష్యత్ లక్ష్యంగా ఎల్‌ఐసీ ఈ పాలసీని తీసుకువచ్చింది.. 

 

ఈ పాలసీదారులకు ఎల్ఐసీ తనకు వచ్చే లాభాల్లో కొంత భాగాన్ని  అందిస్తుంది. అందుకే దీన్ని ప్రాఫిట్ ప్లాన్ అని అంటారు. ఇక ఈ పాలసీ లిమిటెట్ ప్రీమియం పేమెంట్ ప్లాన్. అంటే.. పాలసీ 25 ఏళ్ళు కట్టాలి అంటే.. మీరు కేవలం 20 ఏళ్ళు కడితే సరిపోతుంది.. అయితే ఈ పాలసీలో చేరాలి అంటే 90 రోజుల వయసు ఉండాలి.. అలాగే పాలసీ కనీసం రూ.75,000 మొత్తానికి తీసుకోవాల్సి ఉంటుంది..  నెలవారీ ప్రీమియం రూ.3,832 అవుతుంది. ఇందులో రూ.3667 ప్రీమియం. రూ.165 ట్యాక్స్. అంటే రోజుకు రూ.130 చెల్లిస్తే సరిపోతుంది.


 
ఇక ఈ ఎల్‌ఐసీ జీవన్ తరుణ్ ప్లాన్ మెచ్యూరిటీ గడువు 25 ఏళ్లు. అయినప్పటికీ మీరు ఈ ప్లాన్ కోసం కేవలం 20 ఏళ్ళు కడితే సరిపోతుంది. ఇక ఈ ప్లాన్ కు మెచ్యూరిటీ తర్వాత కూడా కూడా పాలసీ దారుడు జీవించి ఉంటె అప్పుడు వారికీ నాలుగు ఆప్షన్లు ఇస్తారు.. అవి ఏంటి అంటే ?

 

ఆప్షన్ 1.. మెచ్యూరిటీ తర్వాత పాలసీ డబ్బును మొత్తం చెల్లిస్తారు. 

 

ఆప్షన్ 2.. మెచ్యూరిటీ సమయంలో 75 శాతం మొత్తాన్ని ఇస్తారు. 

 

ఆప్షన్ 3..  20 ఏళ్ల తర్వాత ప్రతి ఏడాదికి 10 శాతం పాలసీ మొత్తం చెల్లిస్తారు. మిగతా డబ్బును మెచ్యూరిటీ తర్వాత అందజేస్తారు. 

 

ఆప్షన్ 4లో అయితే 20 ఏళ్ల తర్వాత ప్రతి ఏడాదికి ఒకసారి 15 శాతం డబ్బులు ఇస్తారు. మిగతా 25 శాతం మొత్తాన్ని మెచ్యూరిటీ తర్వాత ఇస్తారు. 

 

పాలసీ తీసుకున్న ఖాతాదారుడు మరణిస్తే.. పాలసీ కవరేజ్ వర్తింపునకు ముందు చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని తిరిగి వెనక్కి ఇచ్చేస్తారు. 8 ఏళ్లలోపు వారికి పాలసీ రిస్క్ పాలసీ తీసుకున్న 2 ఏళ్ల తర్వాత ప్రారంభమౌతుంది. అదే 8 ఏళ్లపైన వయసు ఉంటే పాలసీ రిస్క్ వెంటనే వర్తిస్తుంది. అంతేకాదు.. ఈ పాలసీని మీ పిల్లల పేరుపై కూడా తీసుకోవచ్చు. అయితే ఎల్‌ఐసీ జీవన్ తరుణ్ పాలసీ తీసుకుంటే.. చెల్లించే ప్రీమియం మొత్తం దాదాపు రూ.9 లక్షలకు లోపే చెల్లించాలి. కానీ మెచ్యూరిటీ సమయంలో పొందే మొత్తం రూ.25 లక్షలకుపైగా వస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: