పెట్రోల్, డీజిల్ ధరలు గత నెల అంత తగ్గుతూ వచ్చి దాదాపు నాలుగు రూపాయిలు తగ్గాయి.. అలాంటి పెట్రోల్, డీజిల్ ధరలు రెండు రోజుల క్రితం భారీగా పెరిగి ఇప్పుడు స్థిరంగా కొనసాగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకుండా.. పెరగకుండా స్థిరంగా కొనసాగటం వల్ల వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

 

ఈ నేపథ్యంలోనే వివిధ మెట్రో నగరాల్లో నేడు బుధవారం పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా కొనసాగుతున్నాయి.. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 76.52 రూపాయిల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. అలాగే లీటర్ డీజిల్ ధర 70.48 రూపాయిల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. 

 

పెట్రోల్ ధర రూ.71.94 వద్ద, డీజిల్ ధర 5 పైసలు తగ్గుదలతో రూ.64.77కు చేరింది. ఆర్ధిక రాజధాని అయినా ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర రూ.77.60 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర రూ.67.93 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. మరి ఈ పెట్రోల్, డీజిల్ మరింత ఎప్పుడు తగ్గుతాయి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: