ప్రస్తుత కాలంలో రోజురోజుకు విపరీతంగా ఖర్చులు పెరిగిపోతున్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలు సొంతింటి కలను సాకారం చేసుకోవడం అంత సులువైన పని కాదు. ఇల్లు కట్టుకోవాలంటే భారీ మొత్తంలో డబ్బులు అవసరం అవుతాయి. ఉద్యోగులు, వ్యాపారులు సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి హోమ్ లోన్ పై ఆధారపడుతున్నారు. ఆర్థిక సంస్థలు, బ్యాంకుల ద్వారా హోమ్ లోన్ పొందవచ్చు. 
 
ప్రధాని మోదీ సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే వారి కోసం ఒక అద్భుతమైన పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ పథకం ద్వారా హోమ్ లోన్ పై తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పేరుతో ప్రభుత్వం ఈ పథకాన్ని అందిస్తోంది. ఈ పథకం కింద ఇల్లు కొనుగోలు చేసే అర్హులైన వారికి ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. తక్కువ ఆదాయం ఉన్నవారికి, మధ్య తరగతి వారికి, ఆర్థికంగా వెనుకబడినవారికి ఈ పథకం వర్తిస్తుంది. 
 
రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అధికారిక వెబ్ సైట్ కు వెళ్లాలి. సిటిజన్ అసెస్‌మెంట్ అనే ట్యాబ్ క్లిక్ చేసి అండర్ త్రీ కాంపోనెంట్స్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఆ తరువాత ఆధార్ నంబర్ ఎంటర్ చేసి వివరాలను నమోదు చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే కుటుంబంలో ఎవరి పేరుపై సొంతిల్లు ఉండకూడదు. లోన్ తీసుకుని కట్టుకునే ఇల్లు ఇంట్లోని భార్య పేరుపై ఉండాలి. 200 చదరపు మీటర్లలోపు కార్పెట్ ఇళ్లకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. 
 
ఈ పథకం కింద హోమ్ లోన్ పై అర్హులైన వారికి 2.67 లక్షల వరకు వడ్డీ రాయితీ లభిస్తుంది. 6 లక్షల రూపాయల లోపు రుణ మొత్తంపై 6.5 శాతం, 9 లక్షల రూపాయల లోపు రుణ మొత్తంపై 4 శాతం, 12 లక్షల రూపాయలలోపు రుణంపై వడ్డీ రాయితీ 3 శాతంగా ఉంది. కొంతమంది బ్యాంకుల నుండి ఎక్కువ మొత్తాన్ని రుణంగా పొందవచ్చు. కానీ వడ్డీ సబ్సిడీ మాత్రం 2.67 లక్షల వరకు మాత్రమే లభిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: