ఏంటో ఈ పెట్రోల్ డీజిల్ ధరలు అస్సలు అర్ధం కావు.. ఒకరోజు భారీగా పెరిగితే మరో రోజు భారీగా తగ్గుతాయి. అలాంటి ఈ పెట్రోల్, డీజిల్ ధరలు గత నెల రోజుల నుండి భారీగా తగ్గాయి. భారీగా అంటే 30 పైసాలో.. 40 పైసాలో అనుకుంటున్నారు కదా! కాదు నెల రోజుల్లో దాదాపు 4 రూపాయిలు తగ్గాయి. అలాంటి ఈ పెట్రోల్, డీజిల్ ధరలు రెండు రోజులు నుండి ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. 

 

అయితే వివిధ మెట్రో నగరాల్లో నేడు గురువారం పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా కొనసాగుతున్నాయి.. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 76.52 రూపాయిల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. అలాగే లీటర్ డీజిల్ ధర 70.48 రూపాయిల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా లీటర్ పెట్రోల్ ధర 72.01 పైసలు వద్ద స్థిరంగా అలాగే డీజిల్ ధర 64.70 స్థిరంగా కొనసాగుతున్నాయి. 

 

ఆర్ధిక రాజధాని అయినా ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర రూ.77.60 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర రూ.67.93 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. ఇక అమరావతి, విశాఖపట్నంలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. మరి ఈ పెట్రోల్, డీజిల్ ఎప్పుడు తగ్గుతాయి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: