ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అపర కుబేరుల జాబితాను ప్ర‌తి యేటా ఫోర్బ్స్ మొద‌లుకుని అనేక సంస్త‌లు రిలీజ్ చేస్తూనే ఉంటాయి. ఈ జాబితాలో చాలా మంది బార‌తీయులు సైతం చోటు ద‌క్కుతూ ఉంటుంది. తాజాగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న కుబేరుల జాబితాను ‘హురున్ రిచ్’ అనే సంస్థ విడుదల చేసింది. ఇందులో ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడిగా అమెజాన్ అధినేత జెఫ్ బోజెస్ నిలిచారు.  ప్ర‌పంచ వ్యాప్తంగా దూసుకుపోతోన్న ఆన్‌లైన్ దిగ్గ‌జ సంస్థ అయిన అమోజాన్ వృద్ధి రేటు యేడాది కేడాదికి పెరుగుతూ వ‌స్తోంది.



ఇక భారత్ లో యేడాది కేడాదికి త‌న ఆస్తిని పెంచుకుంటూ పోతోన్న నెంబ‌ర్ వ‌న్ కుబేరుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రపంచంలోనే 9వ స్థానంలో నిలిచారు. ముఖేష్ అంబానీ భార‌త్‌లో తొలి స్థానంలో ఉన్నా ప్ర‌పంచ కుబేరుల జాబితాలో మాత్రం 9వ స్థానంలో నిలిచాడు. ఇక వ‌ర‌ల్డ్ వైడ్‌గా బిలియ‌నీర్ల లిస్టులో చూస్తే భార‌త్ మూడో స్తానంలో ఉంద‌ని కూడా ఈ సంస్థ స‌ర్వే వెల్ల‌డించింది.



ఇక భార‌త‌దేశ నెంబ‌ర్ వ‌న్ కుబేరుడు అయిన ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌, రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత‌ ముఖేష్ అంబానీ సంపద విలువ ఏకంగా 6700 కోట్ల డాలర్లుకు చేరడం విశేషం. అయితే ప్ర‌పంచ అప‌ర కుబేరుల జాబితాలోనే తెలుగు వాళ్లు కూడా చోటు ద‌క్కించుకోవ‌డం ఆనంద దాయ‌క‌ర అంశం.
వీరిలో దివీస్ ల్యాబ్స్ అధినేతలు అయిన మురళీ దివి కుటుంబం ప్రపంచం లోనే 589వ స్థానంలో నిలిచింది. తెలుగువారిలో వీరే అగ్రగణ్యులు.. వీరి సంపాదన విలువ 430 కోట్ల డాలర్లు.



తెలుగు వాళ్ల ప‌రంగా చూస్తే దివీస్ వాళ్లే ఈ లిస్టులో టాప్ ప్లేస్లో ఉండ‌డం తెలుగు వాళ్లు గ‌ర్వించ‌ద‌గ్గ విష‌యం. దివీస్ ఫ్యామిలీ త‌ర్వాత ఈ జాబితాలో ప్రముఖ ఇన్ఫాస్ట్రక్చర్ సంస్థ ఎంఈఐఎల్ (మెయిల్) ప్రపంచంలోనే 1530 స్థానంలో నిలిచింది. వీరి సంపద విలువ 190 కోట్ల డాలర్లు. ఇదే మెయిల్ సంస్థకు చెందిన పీవీ కృష్ణారెడ్డి 180 కోట్ల డాలర్ల సంపాదనతో ప్రపంచంలో 1627వ స్థానంలో నిలిచి కుబేరుడిగా నిలిచాడు. ఈ జాబితాలో వ‌రుస‌గా పీవీ రాంప్రసాద్ రెడ్డి (అరవిందో ఫార్మా) జూపల్లి రామేశ్వరరావు (మైహోమ్) కే సతీష్ రెడ్డి (డాక్టర్ రెడ్డీస్) జీవీ ప్రసాద్ (డాక్టర్ రెడ్డిస్)లు అపర కుబేరుల జాబితా లో చోటు సంపాదించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: