భార‌త‌దేవంలోనే నెంబ‌ర్ వ‌న్ కుబేరుడు అయిన రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గ‌త కొన్నేళ్లుగా త‌న నెంబ‌ర్ స్థానాన్ని తిరుగులేని విధంగా నిలెబ‌ట్టు కుంటూ వ‌స్తున్నారు. రిల‌య‌న్స్ అధినేత ముఖేస్ ఏం చేసినా సంచ‌ల‌న‌మే. మూడేళ్ల క్రితం ఆయ‌న టెలికం రంగంలోకి జ‌యోతో ఎంట్రీ ఇవ్వ‌డ‌మే పెద్ద సంచ‌ల‌నం. నేడు జియో దెబ్బ‌కు మిగిలిన టెలికం కంపెనీలు అన్ని విల‌విల్లాడుతున్నాయి. నేడు దేశ‌వ్యాప్తంగా డేటా విప్ల‌వం క్రియేట్ చేయ‌డం జియోకే సాధ్య‌మైంద‌నే చెప్పాలి.



జియో 4జీ సేవ‌లు నేడు భార‌త దేశంలో ప‌ల్లె ప‌ల్లెకు వెళ్లిపోతున్నాయి. ఇక నేడు భార‌త‌దేశ పారిశ్రామిక రంగంలో ముఖేష్ అంబానీ ఏం చేసినా సంచ‌ల‌న‌మే అవుతోంది. భ‌విష్య‌త్తులో ఎంతో మంది పారిశ్రామిక వేత్త‌ల‌కు.. భార‌త పారిశ్రామిక రంగానికి ముఖేష్ ఓ దిక్సూచిలా ఉన్నారు. ఇక భార‌త‌దేశంలోనూ, ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు సంస్థ‌లు నిర్వ‌హిస్తోన్న స‌ర్వేల్లో ముఖేష్ అంబానీ బార‌త‌దేశంలో నెంబ‌ర్ వ‌న్ శ్రీమంతుడుగా నిల‌వడం కామ‌న్ అయిపోయింది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అపర కుబేరుల జాబితాను ‘హురున్ రిచ్’ అనే సంస్థ తాజాగా విడుదల చేసింది. ఇందులో ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడిగా అమెజాన్ అధినేత జెఫ్ బోజెస్ నిలిచారు.  



ఇక భారత్ లో అత్య‌ధిక ధ‌న‌వంతుల జాబితాలో మ‌ళ్లీ ముఖేష్ పేరు నిలిచింది. ముఖేష్ అంబానీ సంపద విలువ ఏకంగా 6700 కోట్ల డాలర్లుకు చేరడం విశేషం. ఇక ముఖేష్ అంబానీ సంపాద‌న‌ను రోజుల‌కు, గంట‌ల‌కు కుదిస్తే.. ఆయ‌న ఓ గంట సంపాద‌న ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ముఖేష్ అంబానీ గంట సంపాద‌న ఏకంగా 7 కోట్లు. గంటకు 7 కోట్లు సంపాదించే కుబేరుడు ముఖేష్ అంబానీ అని తెలిసి అందరూ ఆశ్చర్య పోతున్నారు. ఇక భార‌త్‌లో మ‌రోసారి ముఖేష్ త‌న స‌త్తా ఏంటో నిరూపించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: