కొందరికి కొన్న వాహనం కంటే.. దానికి వచ్చే ఫ్యాన్సీ నెంబర్ పైనే మోజు ఎక్కువ. అందుకే వాహనం ధరకు దీటుగా ఈ ఫ్యాన్సీ నెంబర్ కూడా దక్కించుకోవాలని ప్రయత్నిస్తారు. అందుకోసం ఎంత ఖర్చు చేసేందుకైనా వెనుకాడరు.

 

 

తాజాగా ఒక నెంబర్ కోసం ఓ పెద్ద మనిషి ఏకంగా రూ. 9 లక్షల రూపాయలు వెచ్చించారు. ఫ్యాన్సీ నెంబర్లతో రవాణా శాఖకు కాసుల పంట పడింది. శుక్రవారం ఖైరతాబాద్ రవాణా కార్యాలయంలో ఆన్‌లైన్ ద్వారా నిర్వహించిన బిడ్డింగ్ లో మొత్తం రూ.31,48,487 ఆదాయం సమకూరింది.

 

 

మూడు ఫ్యాన్సీ నెంబర్లు అత్యధిక ధరలు పలికాయి. టీఎస్ 09 ఎఫ్ కే 9999 నెంబరును ఆర్ ఎస్ బ్రదర్స్ సంస్థ రూ.9.14 లక్షలకు కొనుక్కొంది. టీఎస్ 09 ఎఫ్ ఎల్ 0001 నెంబరును లహరి ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ రూ.3,81,111లకు దక్కించుకుంది. టీఎస్ 09 ఎస్ఎల్ 0099 నెంబరును అస్మిత పద్మనాభన్ రూ.3.33 లక్షలకు దక్కించు కున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: