అవును.. నిజంగానే భారీగా తగ్గాయి.. త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి అని వార్తలు వస్తున్న సమయంలో తగ్గడం ఏంటి అని ఆశ్చర్యం వెయ్యచ్చు.. కానీ ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ ధరలు భారీగానే తగ్గాయి. నిన్న మొన్నటి వరుకు స్థిరంగా కొనసాగిన ఈ పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పుడు భారీగా తగ్గాయి. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే నేడు ఆదివారం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 17 పైసలు తగ్గుదలతో 76.23 రూపాయిలకు చేరింది. అలాగే లీటర్ డీజిల్ ధర 26 పైసలు తగ్గుదలతో 70.01 రూపాయిల వద్దకు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర రూ.71.84 వద్ద, డీజిల్ ధర 5 పైసలు తగ్గుదలతో రూ.64.82కు చేరింది. 

 

ఆర్ధిక రాజధాని అయినా ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర 12పైసలు తగ్గుదలతో రూ.77.60 వద్దకు చేరాయి. డీజిల్ ధర 5 పైసలు తగ్గుదలతో రూ.67.88కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా కదిలాయి.ఈ వారంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత తగ్గే  అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: