బంగారం ధరలు ఎప్పుడు ఎలా తగ్గుతాయే అసలు అర్థం కావు.. ఒకరోజు భారీగా పెరిగితే మరో రోజు భారీగా తగ్గుతాయి. ఇలా తగ్గుతూ పెరుగుతూ వచ్చే బంగారం ధర కేవలం నిన్నటి నుండి భారీగా తగ్గటం ప్రారంభించింది. అంతర్జాతీయ మార్కెట్ లో బలిహీనమైన ట్రెండ్, జువెలర్ల నుండి భారీగా డిమాండ్ తగ్గటమే ఇందుకు కారణం అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. 

 

ఈ నేపథ్యంలో వివిధ మార్కెట్లలో శనివారం బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి.. హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 750 రూపాయిల తగ్గుదలతో 43,660 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 850 రూపాయిల తగ్గుదలతో 39,860 రూపాయలకు చేరింది. 

 

అయితే బంగారం ధరలు భారీగా పడిపోగా వెండి ధర కూడా స్థిరంగా కొనసాగింది. దీంతో నేడు కేజీ వెండి ధర 49,570 రూపాయిల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. కాగా అంతర్జాతీయంగా బంగారం కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా తగ్గటంతో బంగారంపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: