రకరకాల మార్గాల ద్వారా డబ్బును సంపాదించుకోవచ్చు. అన్ని మార్గాలలో డబ్బును ఇన్వెస్ట్ చేసి ఆ డబ్బుతో అదిరిపోయే రాబడిని సాధించడంపై ఎక్కువమంది ఆసక్తి చూపిస్తారు. డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి...? అనే ప్రశ్నకు నిపుణులు తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందడానికి మ్యూచువల్ ఫండ్స్ మంచి ఆప్షన్ అని సూచిస్తున్నారు. 


 
రెండు ఆప్షన్ల ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టవచ్చు. ప్రతి నెలా సిప్ రూపంలో లేదా ఒకేసారి అధిక మొత్తంలో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు. రెండు ఆప్షన్లలో సిప్ రూపంలో పెట్టుబడులు పెట్టటం మంచిది. నెలకు 500 రూపాయలకు పైగా సిప్ ఆప్షన్ లో ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘ కాలంలో మంచి రాబడి పొందవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ గురించి పెద్దగా అవగాహన లేనివారు సిప్ ఆప్షన్ ను ఎంచుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 


 
మ్యూచువల్ ఫండ్స్ క్యాలిక్యులేటర్ల ద్వారా ఫండ్స్ లో ఎంత మొత్తం, ఎన్నేళ్లు పెట్టుబడి పెడితే ఎంత రాబడి పొందవచ్చో ముందుగానే తెలుసుకోవచ్చు. ఉదాహరణకు రోజుకు 160 రూపాయల చొప్పున నెలకు 5000 రూపాయలు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసి పదేళ్ల పాటు ఇన్వెస్ట్మెంట్లను కొనసాగిస్తే 11.61 లక్షల రూపాయలు మెచ్యూరిటీ సమయంలో పొందవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా దాదాపు రెట్టింపు డబ్బును పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: