ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డు ఉపయోగించేవారికి షాక్ ఇచ్చింది. ఐటీ శాఖ ఆధార్ పాన్ అనుసంధానానికి మార్చి 31ని డెడ్ లైన్ గా విధించిన విషయం తెలిసిందే. గడువులోపు అనుసంధానమైన పాన్ కార్డులను మాత్రమే ఉపయోగించటానికి వీలవుతుంది. ఏప్రిల్ 1 నుంచి ఆధార్ తో అనుసంధానం చేయని పాన్ కార్డులను చెల్లనివిగా పరిగణిస్తారు. ఐటీ శాఖ గడువులోగా ఆధార్ పాన్ లింక్ చేయనివారికి 10,000 రూపాయలు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపింది. 
 
ఆదాయపు పన్ను చట్టం 272 బీ కింద పని చేయని పాన్ కార్డు ఎవరైనా వాడినట్టు తేలితే 10 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని ఐటీ శాఖ స్పష్టం చేసింది. పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయని వారు పాన్ ను బ్యాంక్ ఖాతా తెరిచేందుకు గుర్తింపు కార్డుగా వాడవచ్చు. పాన్ లింక్ చేయని వారు 50,000 రూపాయలకు మించి లావాదేవీలు జరిపితే మాత్రం 10,000 రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 
 
అయితే ఏప్రిల్ 1 తరువాత పాన్ కార్డును ఆధార్ తో అనుసంధానం చేస్తే పాన్ కార్డు పని చేస్తుంది. ఆదాయపు పన్ను విభాగం ఇప్పటికే పలుమార్లు ఆధార్ పాన్ లింక్ గడువును పొడిగించింది. ఆదాయపు పన్ను శాఖ మార్చి 31 తరువాత గడవు పొడిగించే అవకాశాలు లేవని సమాచారం. పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయించుకుంటే ఎలాంటి జరిమానాలు పడవు. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 139ఏఏలోని సబ్ సెక్షన్ 2 ప్రకారం ఆధార్, పాన్ కార్డును కచ్చితంగా అనుసంధానం చేసుకోవాలి. దేశంలో ఇప్పటికే 30.75 కోట్లకు పైగా పాన్ కార్డులు ఆధార్ తో లింక్ కాగా 17.58 కోట్ల పాన్ కార్డులు లింక్ కావాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: