అవునండి.. కేంద్ర ప్రభుత్వం నిజంగానే ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది.. ఆ బంపర్ ఆఫర్ నిజంగానే మిమ్మల్ని కోటీశ్వరులు చేస్తుంది. ఏంటి ఆ బంపర్ ఆఫర్ అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.. జీఎస్టీ.. ప్రతి నెలా జీఎస్టీ చెల్లించే వారికి కేంద్రం వచ్చే నెల నుండి లాటరీ ద్వారా 10 లక్షల నుండి కోటి రూపాయలు ఇస్తుంది. 

 

జీఎస్టీపై వినియోగదారులకు, వ్యాపారులకు ఈ బంపర్ ఆఫర్ సొంతం.. ఎలా అనుకుంటున్నారా? జీఎస్టీ వినియోగదారుల లావాదేవీలు వ్యాపారాల ఇన్వాయిస్‌లపై ప్రతి నెలా లక్కీ డ్రాలు నిర్వహిస్తుంది. ఆ లక్కీ డ్రాలో మీ పేరు వచ్చింది అంటే మీకు 10లక్షల నుండి కోటి రూపాయిల వరుకు ప్రైజ్ మనీ వస్తుంది. 

 

అయితే అలా రావాలి అంటే మీరు చెయ్యాల్సింది ఒక్కటే.. అది ఏంటి అంటే? వినియోగదారులు, వ్యాపారులు మధ్య లావాదేవీల్లో బిల్లులు తీసుకోవాలి. ఏదైనా ఒక వస్తువు కొన్న సమయంలో దాని బిల్లును తీసుకోవడం ద్వారా లాటరీని గెలుచుకోవచ్చు. కస్టమర్ మొబైల్ యాప్‌ ద్వారా ఆ కొనుగోలు బిల్లును స్కాన్ చేసి జీఎస్టీ నెట్‌వర్క్ లో అప్‌లోడ్ చెయ్యాలి. అంతే మీ పని. 

 

ఇక తర్వాత.. కేంద్రం ఇచ్చిన బంపర్ ఆఫర్ ఎలా అంటే? ఈ బంపర్ ఆఫర్ లో నెంబర్ 1, 2, 3 బంపర్ ఆఫర్లు ఉంటాయి. అవి కూడా రాష్ట్రాలవారీగా ఉంటాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు, కస్టమ్స్ సభ్యుడు జాన్ జోసెఫ్ రూ .10 లక్షల నుంచి రూ .1 కోట్ల మధ్య లాటరీ ఆఫర్లు ఉంటాయని ప్రకటించాడు. 

 

అయితే దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి లాభం ఏంటి అనుకుంటున్నారా? దీని వలన ప్రభుత్వానికి లాభం ఏమిటంటే కొంతమంది ప్రభుత్వాన్ని మోసం చేసి జీఎస్టీ చెల్లించకుండా వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. ఈ స్కీమ్ వల్ల ఎవరూ మోసం చేయరు అందరు ట్యాక్స్ చెల్లిస్తారు.. అందుకే ఈ కొత్త బంపర్ ఆఫర్ ని ఇచ్చారు. మరి ఇంకేందుకు ఆలస్యం మీరు మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి! 

మరింత సమాచారం తెలుసుకోండి: