ఈ మధ్యకాలంలో దేశి అతిపెద్ద బ్యాంకు అయినా ఎస్బీఐ ఏలాంటి షాకులు ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే బ్యాంకులో ఎన్నో మార్పులు చేస్తున్నారు. ఆ మార్పుల కారణంగా ఎస్బీఐ కస్టమర్లకు షాక్ ల మీద షాకులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎస్బీఐ మరో భారీ షాక్ ఇచ్చింది. 

 

అది ఏంటి అంటే? ఎస్బీఐలో అకౌంట్ కలిగి ఉండి అందులో నో యువర్ కస్టమర్ ప్రక్రియ అంటే కేవైసీను పూర్తి చేసిన వారు మాత్రమే ఇకపై బ్యాంక్ అకౌంట్ ద్వారా ఎలాంటి సేవలు అయినా పొందగలరు.. ఎస్‌బీఐ గతంలోనే కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని కస్టమర్లను సూచించింది. కేవైసీ పెండింగ్‌లో ఉన్న వారు వెంటనే ఆ పనిని పూర్తి చేసుకోవాలని హెచ్చరించింది. 

 

కేవైసీ పూర్తి చేసుకొని వారి అకౌంట్ పూర్తి చెయ్యకపోతే ఖాతాను స్తంభింపజేస్తామని పేర్కొంది. ఈ తరహాలోనే ఇప్పుడు కేవైసీ చేయనివారు డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం కుదరదు. ఆర్‌బీఐ సూచించినట్టు ఫిబ్రవరి 28లోగా అన్ని బ్యాంకులు వాటి కస్టమర్ల కేవైసీని అప్‌డేట్ చేయాలని పేర్కొంది. అందుకే ఎంత తొందర వీలైతే అంత తొందరగా కేవైసీ పూర్తి చెయ్యండి. 

 

ఈ కేవైసి పూర్తి చెయ్యడానికి మీరు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమ్ంట్లు తీసుకు వెళ్లిన కేవైసీ పూర్తి చెయ్యగలరు. ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ లేదా ఆన్‌లైన్‌లో అయిన కేవైసీని పూర్తి చేసుకొనే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: