కరోనా వైరస్ ఇప్పుడు ఇండియానూ వణికిస్తోంది. నిన్న మొన్నటి వరకూ మన దగ్గర కేసులు లేవు కదా అని కాస్త రిలాక్స్ ఫీలైతే.. ఇప్పుడు మాత్రం దేశవ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. ఈ వార్తలు వింటే గుండె గుబేలు మంటోంది.

 

 

అందుకే కరోనా ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఔషధాల ఎగుమతిపై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. చైనా నుండి ఔషధ ముడి పదార్థాలను దిగుమతి చేసుకోవడంలో ఇబ్బందులు ఉన్నందున, రెండు డజనుకు పైగా మందులు, ఫార్మ్‌లేషన్ల ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. మందులు, ఫార్ములేషన్‌ల ఎగుమతిపై తక్షణ నిషేధం విధిస్తూ.. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది.

 

 

మొత్తం 18 రకాల ఔషధాలు, ఫార్ములాల ఎగుమతులపై నిషేధం విధించింది. పారాసెట్మాల్‌, టినిడాజోల్, మెట్రోనిడాజోల్, విటమిన్‌ బి1, బి6, బి12, ప్రొజెస్టెరాన్ సహా అనేక ఔషధాలు, ఫార్ములాల ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించింది. ప్రస్తుత ఎగుమతి విధానంలో మార్పులు చేస్తూ.. విదేశీ వ్యాపార విభాగం డిజిఎఫ్‌టి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: