మన భారత్ ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశం.. అలాంటి ఈ దేశంలో ప్రస్తుతం అంత డిజిటల్ రూపంలోనే సాగుతుంది.. సిటీలలో ఏది కొనాలి అన్న కూడా కరెన్సీ నోట్ల కంటే కూడా ఆన్లైన్ ట్రాన్స్ఫర్లే ఎక్కువ అయ్యాయి. అయితే కరెన్సీ నోట్ల వాడకం తక్కువ అయినప్పటికీ కొత్తగా ఆన్లైన్ ట్రాస్ఫర్లు పెరిగినప్పటికి బ్యాంక్‌ అకౌంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి కదా!

 

అయితే అకౌంట్ తెరవాలి కదా! కానీ ఎక్కడ తెరవాలి? ఎస్‌బీఐలో అకౌంట్ ఓపెన్ చేస్తే మంచిది. ఎస్‌బీఐలో అకౌంట్ తెరవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్లిన ఈ బ్రాంచ్ ఉంటుంది కాబట్టి ఇందులో అకౌంట్ తెరవడం మంచిది. అయితే అకౌంట్ తెరవాలి అంటే ఖచ్చితంగా బ్యాంకుకే వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కూర్చొని ఖాతా తెరవచ్చు. అయితే అది ఎలా అనుకుంటున్నారా? 

 

ఇంట్లోనే అకౌంట్ తెరవాలి అనుకునే వారు.. ముందుగా onlinesbi.com వెబ్‌సైట్‌కు వెళ్లాలి. అక్కడ మీ కుడి చేతి వైపు అప్లై ఫర్ ఎస్‌బీ/కరెంట్ అకౌంట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చెయ్యాలి. అనంతరం మీకు అక్కడ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, కరెంట్ అకౌంట్ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో మీరు స్మాల్ ఎస్‌బీ అకౌంట్ ఆప్షన్ ఎంచుకోవాలి. లేదంటే కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అయితే ఆన్‌లైన్‌లోనే అప్లికేషన్ ఫిల్ చేసి సబ్‌మిట్ చేసినప్పటికీ బ్యాంక్‌కు వెళ్లి డాక్యుమెంట్లు అందించి అకౌంట్‌ను యాక్టివేట్ చేసుకోవలసి ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: