సామాన్యులకు అందని ద్రాక్షగా మారిపోయింది బంగారం ధర. అలాంటి బంగారం ధరలు భారీ అంటే అతి భారీగా పెరిగిపోతున్నాయి. తగ్గేది 30 రూపాయిలు 40 రూపాయిలు అయితే పెరిగేది 300, 400 రూపాయిలు. ఇలా అయితే సామాన్యులు బంగారం ఎలా కొంటారు.. అసలు కొనగలమా? ఈ బంగారాన్ని అనే ఆలోచన వచ్చేసింది. 

 

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ఇప్పట్లో సాధారణ స్థితికి రావు అని అర్థం అవుతుంది. ఈ నేపథ్యంలోనే నేడు సోమవారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 160 రూపాయిల పెరుగుదలతో 43,790 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 160 రూపాయిల పెరుగుదలతో 40,140 రూపాయలకు చేరింది. 

 

అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధర కాస్త తగ్గింది. దీంతో నేడు కేజీ వెండి ధర 50 రూపాయిల తగ్గుదలతో 48,700 రూపాయిలకు చేరుకుంది. అంతర్జాతీయంగా బంగారం, వెండి కొనుగోలుదారుల నుండి డిమాండ్ భారీగా పెరగటంతోనే బంగారంపై ఈ ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా మరో వైపు ఢిల్లీలో, విజయవాడలో, విశాఖపట్నంలో కూడా బంగారం ధరలు ఇలాగే కొనసాగుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: