ఏంటో ఈ పెట్రోల్ డీజిల్ ధరలు అసలు అర్ధం కావు.. ఒకరోజు భారీగా పెరిగితే మరో రోజు భారీగా తగ్గుతాయి. అలాంటి ఈ పెట్రోల్, డీజిల్ ధరలు గత నెల రోజుల నుండి భారీగా తగ్గుతూ వచ్చాయి. భారీగా అంటే 30 పైసలో.. 40 పైసలో అనుకుంటున్నారు ఏమో! కాదు నెల రోజుల్లో దాదాపు 5 రూపాయిలు తగ్గింది. అలాంటి ఈ పెట్రోల్, డీజిల్ ధరలు నిన్నటివరకు కూడా తగ్గాయి.. ఈరోజు ఎటువంటి మార్పు లేకుండా పెరిగాయి. 

 

అయితే వివిధ మెట్రో నగరాల్లో నేడు గురువారం పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా కొనసాగుతున్నాయి.. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 75.94 రూపాయిల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. అలాగే లీటర్ డీజిల్ ధర 69.71 రూపాయిల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా లీటర్ పెట్రోల్ ధర 72.01 పైసలు వద్ద స్థిరంగా అలాగే డీజిల్ ధర 64.70 స్థిరంగా కొనసాగుతున్నాయి. 

 

ఆర్ధిక రాజధాని అయినా ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర రూ.77.60 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర రూ.67.93 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. అయితే అమరావతి, విశాఖపట్నంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. రోజుకు 10 పైసలు.. 20 పైసలు పెరుగుతూ వస్తున్నాయి. మరి ఈ పెట్రోల్, డీజిల్ ఎప్పుడు తగ్గుతాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: