ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ బ్యాంకు అవసరం. ఎందుకంటే నిత్యం బ్యాంకు నుంచి డబ్బు తీస్తూ ఉంటాం. ఇంకా బిజినెస్ వ్యవహారాలు న‌డిపే వారికి అయితే బ్యాంకుల్లో చెక్కులు డిపాజిట్ చేయ‌డం, డీడీలు జ‌మ చేయ‌డం వంటివి ఉన్నందున దాదాపు ప్రతి రోజు ముఖ్యమే. కొన్ని సందర్భాల్లో బ్యాంకు సెల‌వుల దృష్ట్యా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే? 

 

మొన్న ఈ మధ్య వరుసగా ఆరు రోజులు బ్యాంకుకు సెలవలు రానున్నాయి అని వార్తలు వచ్చాయి. ఎందుకు అంటే బ్యాంక్ యూనియన్లు సమ్మోకు పిలవడం వల్ల అలా వార్తలు వచ్చాయి. అయితే అది అనుకోని రీతిలో పోస్ట్ ఫోన్ అయ్యింది. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బ్యాంక్ యూనియన్లు మరోసారి సమ్మెకు పిలుపునిచ్చాయి. అయితే అవి ఎప్పుడు అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి..  

 

మార్చి 27న బ్యాంక్ యూనియన్లు సమ్మె చేస్తున్నట్లు ప్రకటించాయి. బ్యాంకింగ్ రంగంలోని రెండు ప్రధాన యూనియన్లు ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. ఆల్‌ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు ఆల్‌ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ అనే రెండు సంస్దలు సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో సమ్మోకు పిలుపునిచ్చిన మర్చి 27 శుక్రవారం కావడంతో తరవాత రెండు రోజులు బ్యాంకులు పని చెయ్యకపోవడం వల్ల బ్యాంకులు వరుసగా 3 రోజులు క్లోజ్‌లోనే ఉండనున్నాయి. అందుకే బ్యాంకు కస్టమర్లు ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: