బంగారం ధరలు ఈరోజు భారీగా పతనమయ్యాయి.. మూడు రోజుల పెరుగుదలకు నేడు బ్రేకులు పడ్డాయి. బంగారం ధరలు మరింత తగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ భారీగా తగ్గింది అని అందుకే బంగారం ధరలు ఇలా క్షణించాయి అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. 

 

ఈరోజు బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి.. వివిధ మార్కెట్లలో శుక్రవారం బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి.. హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 170 రూపాయిల తగ్గుదలతో 45,140 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 170 రూపాయిల తగ్గుదలతో 41,360 రూపాయలకు చేరింది. 

 

అయితే బంగారం ధరలు భారీగా పడిపోగా వెండి ధర కూడా భారీగా తగ్గింది. దీంతో నేడు కేజీ వెండి ధర 180 రూపాయిల తగ్గుదలతో 49,850 రూపాయిలకు చేరింది. కాగా అంతర్జాతీయంగా బంగారం కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా తగ్గటంతోనే బంగారంపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు ఇలాగె కొనసాగుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: