పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి.. ఒకరోజు పెరుగుతూ.. ఒకరోజు తగ్గుతూ.. మరో రోజు స్థిరంగా ఉంటూ పెట్రోల్, డీజిల్ ధరలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మొన్నటి వరుకు స్థిరంగా కొనసాగిన పెట్రోల్, డీజిల్ ధరలు రెండు రోజుల నుండి భారీగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. 

 

నేడు శనివారం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 15 పైసలు తగ్గుదలతో 75.62 రూపాయిలకు చేరింది. అలాగే లీటర్ డీజిల్ ధర 9 పైసలు తగ్గుదలతో 69.53 రూపాయిల వద్దకు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.71.09 వద్ద, డీజిల్ ధర రూ.64.08 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. 

 

ఆర్ధిక రాజధాని అయినా ముంబైలోను పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే భారీగా తగ్గాయి. పెట్రోల్ ధర 12 పైసలు తగ్గుదలతో రూ.77.60 వద్దకు చేరాయి. డీజిల్ ధర 5 పైసలు తగ్గుదలతో రూ.67.88కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా కదిలాయి. కాగా కేవలం రెండు నెలల్లో పెట్రోల్, డీజిల్ పై ఆరు రూపాయిలు తగ్గాయి. వాహనదారులకు ఇది ఒకరకంగా శుభవార్త అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: