ఆర్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది. డెబిట్, క్రెడిట్ కార్డ్ యూజర్లు వాటిని వాడకపోతే వెంటనే ఉపయోగించాలని పేర్కొంది. కార్డులు ఉపయోగించకపోతే ఈ నెల 16 తరువాత అవి పనిచేయవు. కొన్ని రోజుల క్రితం ఆర్బీఐ విడుదల చేసిన ఒక నోటిఫికేషన్ లో ఈ విషయాలను వెల్లడించింది. ఆన్ లైన్, కాంటాక్ట్ లెస్ లావాదేవీలకు చాలా కాలంగా ఉపయోగించని డెబిట్/ క్రెడిట్ కార్డులను మార్చి 16 తరువాత ఉపయోగించడం కుదరదని స్పష్టం చేసింది. 
 
ఆర్బీఐ ఇప్పటికే కార్డుల జారీ సంస్థలకు ఈ మేరకు సూచనలు చేశామని పేర్కొంది. మార్చి 16లోపు డెబిట్, క్రెడిట్ కార్డ్ యూజర్లు వాటిని వినియోగించాలని సూచించింది. ఆర్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డుల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయాన్ని చెల్లింపులు, పరిష్కారాల చట్టం 2007లోని సెక్షన్ 10(2) ఆధారంగా తీసుకున్నట్లు తెలిపింది. కార్డు బ్లాక్ అయిపోతే వినియోగదారులు మరలా కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకుని, తీసుకోవాల్సి ఉంటుంది. 
 
కార్డులను ఇప్పటివరకూ వినియోగించనివారు ఏదో ఒక ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ చేస్తే కార్డు బ్లాక్ కాదు. గత కొన్నేళ్లుగా డెబిట్, క్రెడిట్ కార్డులను వినియోగించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఆర్బీఐ యూజర్లకు మెరుగైన, సురక్షితమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. డెబిట్, క్రెడిట్ కార్డులు యూజ్ చేసేవారికి కొత్త సేవలు కూడా అందుబాటులోకి రాబోతున్నాయని తెలుస్తోంది. ట్రాన్సాక్సన్ లిమిట్స్ సెట్ చేసుకోవడం, కార్డు స్విచ్ ఆన్ లాంటి సేవలు యూజర్లకు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: