నిన్న స్టాక్ మార్కెట్ ఎంత దారుణంగా పడిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ముడి చమురు ధరలు అయితే మరి దారుణంగా పడిపోయాయి.. ప్రపంచంలో చమురు ఉత్పత్తి చేస్తున్న దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతోనే గత 20 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ముడి చమురు ధరలు భారీగా పడిపోయాయి. 

 

ముడి చమురు ధరలు దాదాపు 28 శాతానికిపైగా తగ్గిపోవడంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 36 డాలర్లు, అమెరికన్ డబ్ల్యుటీఐ ఆయిల్ బ్యారెల్ ధర 32 డాలర్లకు పడిపోయాయి. ఇక ఈ నేపథ్యంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు భారీగా తగ్గిపోయాయి. లీటర్ పెట్రోల్ ధరకు 25 పైసల చొప్పున తగ్గగా... లీటర్ డీజిల్ ధరకు 27 పైసలు తగ్గింది. 

 

హైదరాబద్ లో లీటర్ పెట్రోల్ ధర 25 పైసలు తగ్గుదలతో రూ. 75.04కు చేరగా, డీజల్ ధర 27 పైసలు తగ్గుదలతో 68.88 రూపాయలకు చేరింది. అయితే ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు కేవలం పైసలలో తగ్గిన భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికి వాహనదారులకు ఇది మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: