పెట్రోల్, డీజిల్ ధరలు ఒకరోజు భారీగా పెరిగితే మరో రోజు భారీగా తగ్గుతాయి. ఇలా తగ్గుతూ పెరుగుతూ ఉండే ఈ పెట్రోల్ డీజిల్ ధరలు కరోనా వైరస్ పుణ్యమా అని భారీగా తగ్గుతున్నాయి.. మొన్నటికి మొన్న స్టాక్ మార్కెట్లు మరి భారీగా పడిపోయాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. అయితే ఈరోజు మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే నేడు బుధవారం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 74.75 రూపాయిల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. అలాగే లీటర్ డీజిల్ ధర 7 పైసలు తగ్గుదలతో 68.60 రూపాయిలకు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర రూ.69.94 వద్ద, డీజిల్ ధర 5 పైసలు తగ్గుదలతో రూ.64.77కు చేరింది. 

 

ఆర్ధిక రాజధాని అయినా ముంబయిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర రూ.77.60 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర 5 పైసలు తగ్గుదలతో రూ.67.30కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా కదిలాయి. కాగా కేవలం నెల రోజుల్లో పెట్రోల్, డీజిల్ పై నాలుగు రూపాయిలు తగ్గింది.

మరింత సమాచారం తెలుసుకోండి: