ప్రధాని నరేంద్ర మోదీ మధ్యతరగతి ప్రజలకు షాక్ ఇచ్చారు. కేంద్రం స్మాల్ స్కేల్ సేవింగ్స్ స్కీమ్స్ పై వడ్డీ రేట్లను తగ్గించడానికి సిద్ధమవుతోంది. ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి అతి త్వరలో కేంద్రం వడ్డీ రేట్లను తగ్గించబోతున్నట్లు ప్రకటన చేశారు. కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటే దాని ప్రభావం ఎక్కువగా పేద, మధ్యతరగతి వర్గాలపై పడనుంది. 
 
ఏప్రిల్ 1 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. సుకన్య సమృద్ధి అకౌంట్, సీనియర్ సిటిజన్స్ అకౌంట్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పై వడ్డీ రేట్లు తగ్గనున్నాయని సమాచారం. వచ్చే నెల నుండి కేంద్రం వడ్డీ రేట్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం అమలులోకి రానుంది. ప్రభుత్వ అధికారి స్మాల్ సేవింగ్ స్కీమ్స్ వడ్డీ రేట్లు, ఆర్బీఐ రెపో రేటు మధ్య అంతరం దిగిరావాల్సి ఉందని అందువల్ల వడ్డీ రేట్లు తగ్గొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
ఆర్థిక వ్యవస్థను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాయి. మార్కెట్ నిపుణులు ఆర్బీఐ రాబోయే సమావేశంలో వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉందని పేర్కొన్నారు. కరోనా వైరస్ ప్రభావంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, ఇతర ప్రముఖ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయి. ఆర్బీఐ 25 బేసిక్ పాయింట్లు రెపో రేటు తగ్గించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: