పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు ఎలా ఉంటున్నాయో ఎవరికి తెలియటం లేదు.. ఈరోజు మళ్ళి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి.. మొన్నటివరకు పెరుగుతూ.. తగ్గుతూ వచ్చిన ఈ పెట్రోల్, డీజిల్ ధరలు గత కొద్దీ రోజుల నుండి భారీగా తగ్గుతూ వస్తున్నాయి. రెండు నెలల క్రితం వరుకు 80 రూపాయిలు ఉన్న ఈ పెట్రోల్ ధర ఇప్పుడు 75 రూపాయిలకే వస్తుంది. దీంతో కేవలం రెండు నెలల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఏకంగా 6 రూపాయిలు తగ్గాయి. 

 

అయితే ఇలా తగ్గటానికి ఒక కారణం ఉంది.. అది ఏంటి అంటే? కరోనా వైరస్.. ఈ కరోనా వైరస్ కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. దీంతో నేడు శుక్రవారం వివిధ మెట్రో నగర్లో లీటర్ పెట్రోల్ ధరకు 20 పైసల చొప్పున తగ్గగా... లీటర్ డీజిల్ ధరకు 19 పైసలు తగ్గింది. హైదరాబద్ లో లీటర్ పెట్రోల్ ధర 20 పైసలు తగ్గుదలతో రూ. 74.56కు చేరగా, డీజల్ ధర 19 పైసలు తగ్గుదలతో 68.47 రూపాయలకు చేరింది. 

 

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గటమే ఇందుకు కారణం అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. కాగా పెట్రోల్, డీజిల్ ధరలు భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి అని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఏది ఏమైనా.. పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా అయితే పెరిగాయో.. అలాగే తగ్గుతూ వస్తున్నాయి. అయితే మరొ 10 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గుతాయి అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: