స్టాక్ మార్కెట్లలో బీభత్సమైన నష్టాలు వస్తున్నాయి. సెన్సెక్స్ ఘోరంగా పడిపోతోంది. రోజు రోజుకూ లక్షల కోట్ల సంపద ఆవిరైపోతోంది. ఈ షేరు... ఆ షేరు అని తేడా ఏదీ లేదు.. ఏ షేరు కూడా నష్టపోకుండా లేదు. పెద్ద పెద్ద కంపెనీలు .. మంచి ట్రాక్ రికార్డు ఉన్న కంపెనీల షేర్లు కూడా ఇప్పుడు చాలా చౌకగా కనిపిస్తున్నాయి.

 

 

మరి ఇప్పుడు షేర్లు కొంటే.. భవిష్యత్తులో లాభాలు వస్తాయా.. ఈ సమయంలో షేర్ మార్కెట్ లో ఎంటర్ అవడం లాభదాయకమేనా.. ఇది చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న. వారెన్ బఫెట్ వంటి వారు.. అంతా మార్కెట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు నువ్వు లోపలకు వెళ్లు.. అంతా లోపలకు వెళ్లేటప్పుడు నువ్వు బయటకురా అని సలహా ఇస్తారు.

 

 

మరి ఇప్పుడు షేర్లు కొంటే మంచిదేనా.. దీనికి నిపుణులు చెప్పే సమాధానం ఏంటంటే.. ఇప్పుడు షేర్లు కొంటే మంచిదే.. అయితే అది దీర్ఘకాలిక దృష్టితో కొనాలి.. ఈరోజు కొని మరో వారంలో అమ్మే ఆలోచనతో కొనకూడదు. అలాగే ఒకేసారి కొనకూడదు. మనం పెట్టే పెట్టుబడిని ఓ పది భాగాలు చేసి.. క్రమంగా విడతల వారీగా పెట్టుబడి పెట్టాలి. అది కూడా కేవలం ఏ ఒక్క షేరుపైనో కాకుండా.. వివిధ కంపెనీల షేర్లు కొనాలి.. అని చెబుతున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: