కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమో ఇప్పుడిప్పుడే ప్రతిఒక్కరికీ తెలిసొస్తోంది. కోవిడ్ 19 ప్ర‌పంచ వ్యాప్తంగా ఒక్కో దేశానికి శ‌ర‌వేగంగా విస్త‌రిస్తూ వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే మ‌న‌దేశంలో కూడా ఈ వైర‌స్ ఒక్కో రాష్ట్రానికి విస్త‌రిస్తూ వ‌స్తోంది. అయితే ఈ వైర‌స్ దెబ్బ‌తో సాఫ్ట్‌వేర్ ఉద్యోగ‌స్తులు బెంబేలు ఎత్తుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌లు సాఫ్ట్‌వేర్ కంపెనీలు త‌మ ఉద్యోగ‌స్తుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌కటించాయి.  ఉద్యోగుల ఆరోగ్యాన్ని పరిణగలోకి తీసుకొని వారికి వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ అందిస్తున్నాయి.



ఈ ఆఫ‌ర్‌తో ఉద్యోగ‌స్తులు అంద‌రూ ఇంట్లోనే కూర్చొని ఉద్య‌గం చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు ఐటీ కంపెనీలు ఇదే ప్లాన్ అమ‌లు చేస్తున్నాయి. మొత్తం 18 - 20 ల‌క్ష‌ల మంది ఉద్యోగులు ఇలాగే ప‌ని చేస్తున్నారు. ప్రస్తుతం ఓఎస్‌పీ (అదర్ సర్వీసెస్ ప్రొవైడర్స్) విధానం కింద వర్క్ ఫ్రం హోమ్‌పై కొన్ని ఆంక్షలు ఉన్నాయి. అయితే కొన్ని ప్ర‌త్యేక స‌మయాల్లో ఉద్యోగులు ఇంటి వ‌ద్ద నుంచి ప‌నిచేసేందుకు కొన్ని అనుమ‌తులు ఉన్నాయి. ఇప్పుడు ఈ నిబంధ‌న కింద ప్ర‌తి ఐటీ ఉద్యోగికి కంపెనీలు ఈ వ‌ర్క్ ఫ్రం హోం ఆప్ష‌న్ ఇస్తున్నాయి. దీంతో ఈ ఉద్యోగులు అంతా ఎంజాయ్ చేస్తూ వ‌ర్క్ చేస్తున్నారు.



ఇక చైనాలోని పుహాన్ న‌గ‌రంలో ప్రారంభ‌మైన క‌రోనా వైర‌స్ వ‌ల్ల ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ 4,000 మందికిపైగా మరణించారు. ఇంకా లక్ష మందికి పైగా వైరస్ బాధితులు ఉన్నారు. మన దేశంలోనూ కరోనా బాధితుల సంఖ్య 70 మార్క్ పైకి చేరింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం పలు కేటగిరిలు మినహా అన్ని వీసాలను రద్దు చేసింది. ఇకపోతే ఫ్లిప్‌కార్ట్, గూగుల్ వంటి కంపెలు వాటి ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ సదుపాయం కల్పిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: