మొన్నటి వరకూ బంగారం ధరలు రోజూ పైపైకే వెళ్లాయి. పది గ్రాముల బంగారం రూ. 45,000 దాటి వెళ్లింది. అయితే ఇప్పుడు స్టాక్ మార్కెట్ పుంజుకోవడంతో.. మళ్లీ బంగారం ధరలు భారీగా తగ్గాయి. మదుపరులు పెట్టుబడులు మళ్లించడం, రూపాయి బలపడటం కారణంగా మేలిమి బంగారం (24 క్యారెట్స్‌) ధర రూ.1097 తగ్గి రూ.42,600కు చేరింది.

 

 

గత సెషన్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.43,697గా నమోదైంది. వెండి సైతం కేజీ రూ.1574 తగ్గి, 44,130కి చేరుకుంది. దేశీయ స్టాక్‌మార్కెట్లు ట్రేడింగ్‌ ప్రారంభంలో భారీగా పడిపోయింది. తర్వాత మళ్లీ పుంజుకుంది. ద్రవ్య లభ్యత విషయంలో ఆర్‌బీఐ జోక్యం చేసుకోవడం రూపాయికి కలిసొచ్చింది.

 

 

ఈ పరిణామాలతో డాలరుతో రూపాయి మారకం విలువ 23 పైసలు కోలుకుంది. అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 1,584 డాలర్లు ఉంటే వెండి ధర 15.65 డాలర్లు ఉంది. ఈ పరిణామాలతో బంగారం ధర తగ్గింది. అయితే కరోనా వైరస్ ప్రమాదం ఉండటంతో బంగారం ధరలు మళ్లీ పెరిగే ఛాన్స్ ఉంది. అందుకే కొనుక్కునేవారు బంగారం కొనొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: