మైక్రోసాఫ్ట్ అధినేత‌,  ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్‌ మైక్రోసాఫ్ట్‌నుంచి వైదొలిగారు. ప్రపంచ కుబేరుల జాబితాలో ప్ర‌తిసారి టాప్ ప్లేస్లో ఉండే బిల్‌గేట్స్ గ‌తేడాది కూడా ఆస్తుల ప‌రంగా మొద‌టి స్థానంలో నిలిచారు. ఆయ‌న గ‌తేడాది ఆస్తుల విలువ 105.7 బిలియన్ల డాలర్లుగా ఫోర్బ్స్‌ ప్రకటించింది. బిల్‌గేట్స్ దెబ్బ‌తో అమెజాన్‌ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్‌ బెజోస్‌ రెండో స్థానంలోకి చేరాడు. ఆయన ఆస్తి విలువ 103.9 బిలియన్లు. ఇక ప్ర‌స్తుతం మైక్రోసాఫ్ట్ బోర్డు సలహాదారుడిగా ఉన్న బిల్‌గేట్స్‌ తన పదవికి రాజీనామా చేశారు.



ఇప్ప‌టికే ఎన్నో సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌కు కోట్లాది రూపాయ‌లు వెచ్చిస్తోన్న బిల్‌గేట్స్ ఇప్పుడు పూర్తిస్థాయిలో సామాజిక సేవలకు పరిమితమవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని కోట్ల‌కు అధిప‌తి... ప్ర‌పంచంలోనే తిరుగులేని కుబేరుడు అయిన బిల్‌గేట్స్ ఎంతో ఉన్న‌త ప‌ద‌విలో ఉండి.. త‌న కోట్లాది రూపాయ‌ల‌ను స‌మాజ సేవ‌కు వెచ్చిస్తూ వ‌స్తున్నారు.



ఇక ఇప్పుడు ఆయ‌న పూర్తిగా మైక్రోసాఫ్ట్‌ను వ‌దులుకుని స‌మాజ సేవ‌కు అంకిత మ‌వ్వాల‌ని తీసుకున్న నిర్ణ‌యానికి ప్ర‌పంచం మొత్తం స‌లామ్ చేస్తోంది.
కాగా, 2014లో ఆయన మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్‌ పదవినుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. 2000లో సీఈఓ పదవికి రాజీనామా చేసిన ఆయన 2008నుంచి ఫుల్‌టైం పనికి కూడా గుడ్‌బై చెప్పారు. 1975లో మైక్రోసాఫ్ట్‌ను స్థాపించి దాన్ని ప్రపంచ నెంబర్‌ వన్‌ స్థాయికి తీసుకెళ్లారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: