ప్రధాని మోదీ కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి షాక్ ఇచ్చారు. జీఎస్టీ కౌన్సిల్ తాజాగా మొబైల్ ఫోన్లపై జీఎస్టీ పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకనుండి స్మార్ట్ ఫోన్ ధరలు భారీగా పెరగనున్నాయి. ఈరోజు సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. చెప్పులు, పురుగుమందులపై జీఎస్టీ పెంపు గురించి చర్చ జరగగా కౌన్సిల్ వాటిపై పెంపుకు అంగీకరించలేదు. టెక్స్ టైల్ ఉత్పత్తులపై జీఎస్టీ పెంచుతున్నట్లు వార్తలు వినిపించినా ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనను కూడా పక్కన పెట్టారని సమాచారం. 
 
ప్రస్తుతం మొబైల్ ఫోన్లపై జీఎస్టీ రేటు 12 శాతంగా ఉంది. వీటిపై రేటును 18 శాతానికి పెంచటానికి కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఫోన్లపై ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ ను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం మొబైల్ ఫోన్లపై 5 శాతం ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ గా ఉంది. ఇప్పటికే దేశంలో కరోనా ప్రభావంతో స్మార్ట్ ఫోన్ల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
కరోనా ప్రభావంతో ఫీచర్ ఫోన్లు, మొబైల్ ఫోన్ విడిభాగాల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కరోనాకు జీఎస్టీ పెంపు తోడు కావడంతో 10,000 రూపాయల లోపు స్మార్ట్ ఫోన్లు కూడా వెయ్యి నుండి రెండు వేల రూపాయలు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కరోనా కారణంగా చైనాలో విడిభాగాలు తయారయ్యే కంపెనీలు మూతపడటంతో ఆ ప్రభావం స్మార్ట్ ఫోన్ ధరలపై పడనుంది. చైనాకు చెందిన షావోమీ సంస్థ ఇప్పటికే రెడ్‌మీ8 ధరను భారీగా పెంచిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: