కరోనా పుణ్యమా అని బంగారం ధరలు కొండా మీద ఎక్కి కూర్చున్నాయి. ఇప్పటికే బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. ఇంకా అసలు ఈ బంగారం మనం కొనగలమా? లేదా అని అనిపించేలా బంగారం ధరలు పెరిగాయి. ఇక పోతే ఈ బంగారం ధరలు రెండు రోజుల నుండి కాస్త తగ్గాయి.. కానీ ఈరోజు మళ్లీ పెరిగాయి. ఆ బంగారం ధరలు చూస్తే షాక్ అవ్వక తప్పదు మరి.. అలా ఉంటాయి ఆ బంగారం ధరలు. ఇక ఈరోజు ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

నేడు ఆదివారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయిల పెరుగుదలతో 42,930 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 రూపాయిల పెరుగుదలతో 39,350 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు స్వల్పంగా పెరగగా వెండి ధర కూడా స్వల్పంగానే పెరిగింది. దీంతో నేడు కేజీ వెండి ధర 10 రూపాయిల  తగ్గుదలతో 47,810 రూపాయిలకు చేరుకుంది. 

 

అంతర్జాతీయంగా బంగారం, వెండి కొనుగోలుదారుల నుండి డిమాండ్ భారీగా పెరగటంతోనే బంగారం, వెండిపై ఈ ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా మరో వైపు ఢిల్లీలో, విజయవాడలో, విశాఖపట్నంలో కూడా బంగారం ధరలు ఇలాగే కొనసాగుతున్నాయి. ఈ బంగారం ధరలు ఇప్పట్లో తగ్గేలా లేవు అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: