కరోనా వైరస్ కారణంగా మొన్న సోమవారం స్టాక్ మార్కెట్ ఎంత దారుణంగా పడిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఆ రోజు మూడు చమురు ధరలు కూడా దాదాపు 30 శాతం పడిపోయాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. ఆ తగ్గుదలను చూస్తే ఎవరైనా సరే వాహనదారులు వావ్ అంటారు. అలాంటి తగ్గుదలను చూసి భరించలేని కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలపై సుంకాన్ని ఏకంగా 3 రూపాయిలు పెంచేసింది. ఇక పోతే ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత ఉన్నాయి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

నేడు హైదరాబాద్ మార్కెట్ లో లీటర్ పెట్రోల్ ధరకు 13 పైసల చొప్పున తగ్గగా... లీటర్ డీజిల్ ధరకు 16 పైసలు తగ్గింది. దీంతో లీటర్ పెట్రోల్ ఇప్పుడే కేవలం 74 రూపాయిలు మాత్రమే. ఇంకా డీజిల్ కూడా 16 పైసలు తగ్గుదలతో 67.97కు చేరింది. ఇంకా ఢిల్లీలో అయితే ఏకంగా రెండు రూపాయిలు తగ్గింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.70.29కు చేరింది. 

 

పెట్రోల్‌పై రూ.2.69 తగ్గగా.. డీజిల్‌పై రూ.2.33 తగ్గింది. లీటర్ డీజిల్ రూ.63.01కి చేరింది. కాగా అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పతనం కావడంతో.. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించినట్టు పలు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. కాగా ఈ పెట్రోల్, డీజిల్ ధరలు మరో ఆరు రోజుల్లో ఇంకా భారీ తగ్గుతాయి అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. మరి పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత తగ్గుతాయి అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: