మొన్న బ్లాక్ మండే ఎఫెక్ట్.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. రోజు రోజుకు భారీ తగ్గుదలతో పెట్రోల్, డీజిల్ ధరలు మంచి శుభవార్త చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. ఎంత తగ్గాయి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

నేడు సోమవారం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 17 పైసలు తగ్గుదలతో 73.97 రూపాయిలకు చేరింది. అలాగే లీటర్ డీజిల్ ధర 16 పైసలు తగ్గుదలతో 67.82 రూపాయిలకు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర రూ.69.94 వద్ద, డీజిల్ ధర 5 పైసలు తగ్గుదలతో రూ.62.77కు చేరింది. 

 

ఆర్ధిక రాజధాని అయినా ముంబయిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర రూ.77.60 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర 5 పైసలు తగ్గుదలతో రూ.67.30కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గాయి. కాగా కేవలం నెల రోజుల్లో పెట్రోల్, డీజిల్ పై ఆరు రూపాయిలు తగ్గింది.

మరింత సమాచారం తెలుసుకోండి: