ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలను కరోనా వైరస్ భయభ్రాంతులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కరోనా భారీన పడి 5,833 మంది మరణించగా కరోనా బాధితుల సంఖ్య 1,56,000 కు చేరింది. భారత్ లో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే వైరస్ సోకిన వారి సంఖ్య 107కు చేరింది. అనుమానితుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
కరోనా భారీన పడే వారికి ఆర్థికంగా అండగా నిలవాలనే ఆలోచనతో కేర్ కవర్ అనే హెల్త్ కేర్ ఫైనాన్స్ కంపెనీ 5 లక్షల రూపాయలు కరోనా చికిత్స కోసం అందిస్తోంది. లోన్ పొందటానికి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదని గంటలోపే లోన్ పొందవచ్చని సంస్థ చెబుతోంది. ఈ సంస్థ చికిత్స కోసం అందించే రుణాలపై వడ్డీ వసూలు చేయదు. 
 
తీసుకున్న అప్పును ఏడాదిలోపు చెల్లించేవారు వడ్డీ రహిత రుణాన్ని పొందే అవకాశం ఉంటుంది. లోన్ టెన్యూర్ 18 నుండి 24 నెలల లోపు ఉన్నవారికి 12 నుండి 15 శాతం మధ్యలో వడ్డీ రేటు ఉంటుంది. లోన్ పొందాలనుకునేవారు 15,000 రూపాయల నుండి 5,00,000 రూపాయల లోపు ఎంతైనా తీసుకోవచ్చు. ఆర్థిక పరిస్థితుల కారణంగా వైద్యానికి ఎవరూ దూరం కాకూడదని మెడికల్ లోన్స్ ను అందుబాటులోకి తెచ్చినట్లు కేర్ కవర్ ఫౌండర్ నివేశ్ ఖండెల్వాల్ చెప్పారు. లోన్ కోసం 21 నుండి 60 ఏళ్ల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. లోన్ పొందడానికి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ స్టేట్ మెంట్ అవసరం అవుతాయి. అయితే ఇక్కడ పేరు నమోదు చేసుకునే వారు 999 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. పేరు నమోదు చేసుకున్నవారు ఏడాది వ్యాలిడిటీ ఉన్న కవర్ కేర్ కార్డును పొందవచ్చు. కవర్ కేర్ కార్డు కలిగిన వారు 9298889888 నంబర్ కు కాల్ చేసి లోన్ పొందవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: