పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా అంటే అతి భారీగా తగ్గాయి.  కరోనా వైరస్ పుణ్యమా అని పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. అయితే పెట్రోల్, డీజిల్ తగ్గుదలకు బ్రేకులు వెయ్యాలని కేంద్రం ఏకంగా 3 రూపాయిల సుంకాన్ని పెంచేసింది. అయినప్పటికీ కరోనా వైరస్ ఇంకా కొనసాగుతుండటంతో పెట్రోల్, డీజిలు ధరలు భారీగా తగ్గాయి. 

 

నేడు మంగళవారం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 13 పైసలు తగ్గుదలతో 73.97 రూపాయిలకు చేరింది. అలాగే లీటర్ డీజిల్ ధర 10 పైసలు తగ్గుదలతో 67.82 రూపాయిల వద్దకు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.66.09 వద్ద, డీజిల్ ధర రూ.64.08 వద్దకు క్షిణించాయి. 

 

ఆర్ధిక రాజధాని అయినా ముంబైలోను పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే భారీగా తగ్గాయి. పెట్రోల్ ధర 12 పైసలు తగ్గుదలతో రూ.73.60 వద్దకు చేరాయి. డీజిల్ ధర 5 పైసలు తగ్గుదలతో రూ.67.88కు చేరింది. కేవలం 15 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు 3 రూపాయిలు తగ్గాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఇంకా క్షిణించే అవకాశం ఉంది అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: