స్టాక్ మార్కెట్లపై కరోనా ప్రభావం భారీగా పడుతోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో నిన్న స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. మన దేశంతో పాటు ఇతర దేశాల స్టాక్ మార్కెట్లు కూడా పతనం కావడం గమనార్హం. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 9,200 పాయింట్ల దిగువకు పడిపోగా బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 32,000 పాయింట్ల దిగువకు పడిపోయి సెన్సెక్స్ చరిత్రలో రెండో అతిపెద్ద పతనాన్ని నమోదు చేసింది. 


 
దాదాపు సున్నా స్థాయికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఫండ్ రేట్లను తగ్గించింది. అయినా స్టాక్ మార్కెట్లు మాత్రం భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ రెండున్నరేళ్లు, నిఫ్టీ మూడేళ్ల కనిష్టానికి పడిపోయింది. నిన్న అన్ని రంగాల షేర్లు భారీగా పతనమయ్యాయి. నిన్న మరో 9 దేశాలలో కరోనా వ్యాపించటం, మరణాల సంఖ్య పెరగటంతో రిటైల్ అమ్మకాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. కరోనా బాధితుల సంఖ్య దేశవ్యాప్తంగా 114కు చేరింది. 


 
ఆసియా మార్కెట్లు 2 నుండి 4 శాతం నష్టపోగా యూరప్ మార్కెట్లు ఆరంభంలోనే 8 శాతం నష్టపోయాయి. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో రోజురోజుకూ డిమాండ్ తగ్గుతూ ఉన్డటంతో చమురు ధరలు 10 శాతం తగ్గాయి. చైనాలో రిటైల్ అమ్మకాలు భారీగా తగ్గగా ఆర్థిక సంక్షోభం దిశగా ఆ దేశం పయనిస్తోంది. నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు ఆవిరైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: