దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వైరస్ భారీన పడి ప్రపంచవ్యాప్తంగా 7,007 మంది మృతి చెందారు. తెలంగాణ రాష్ట్రంలో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రైల్వే శాఖ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్లాట్‌ఫామ్ టికెట్ ధరలను భారీగా పెంచింది. 
 
భారతీయ రైల్వే శాఖ 10 రూపాయల టికెట్ ను ఏకంగా 5 రెట్లు పెంచటంతో 10 రూపాయలు ఉన్న టికెట్ ధర 50 రూపాయలయింది. రైల్వే స్టేషన్లలో జనాల రద్దీని తగ్గించాలనే ఉద్దేశంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని రైల్వే శాఖ చెబుతోంది. దాదాపు 250 స్టేషన్లలో ప్లాట్‌ఫామ్ టికెట్ ధరలు పెరిగాయని సమాచారం. ఈరోజు అర్ధరాత్రి నుండి పెంచిన ధరలు అమలులోకి రానున్నాయి. 
 
ప్రభుత్వం ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఉంది. రైల్వే శాఖ తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు పెరిగిన ధరలు అమలులో ఉండనున్నాయి. రైల్వే స్టేషన్లలో కరోనా ప్రభావాన్ని తగ్గించటానికి ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. కొన్ని రోజుల క్రితం రైల్వే శాఖ ఏసీ కోచ్ ల నుంచి కర్టన్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. మినిమం ఏసీ టెంపరేటర్ 24 నుండి 25 డిగ్రీల సెంటిగ్రేడ్ వుండాలని సూచించటంతో పాటు బాగా ఉతికిన బెడ్ షీట్లు మాత్రమే ఉపయోగించాలని ఆదేశించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: