పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉంటున్నాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా వైరస్ పుణ్యమా అని పెట్రల్, డీజిల్ ధరలు భారీగా పతనమయ్యాయి. గత సోమవారం మూడు చమురు ధరలు సుమారు 25శాతం తగ్గాయి అంటే నమ్మండి. అలాంటి ఈ పెట్రోల్, డీజిల్ ధరలు కేవలం వారం రోజుల్లో 3 రూపాయిలు తగ్గింది. 

 

అయితే ఇప్పుడు ఆ తగ్గుదలకు బ్రేకులు పడ్డాయ్. అలా అని పెరగటం కూడా లేదు.. స్థిరంగా కొనసాగుతున్నాయి. అంటే ఇది వాహనదారులకు శుభవార్తే కదా.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా స్థిరంగా కొనసాగడం కూడా వాహనదారులకు శుభవార్త అనే చెప్పాలి. ఇకపోతే ఈ పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా కొనసాగుతున్నాయి అంటే? 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే నేడు బుధవారం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 73.97 రూపాయిల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. అలాగే లీటర్ డీజిల్ ధర 67.87 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర రూ.69.59 వద్ద, డీజిల్ ధర రూ.62.29కు చేరింది. 

 

ఆర్ధిక రాజధాని అయినా ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర రూ.78.60 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర రూ.67.93 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా కదిలాయి. కాగా కేవలం వారం రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ పై మూడు రూపాయిలు తగ్గింది.

మరింత సమాచారం తెలుసుకోండి: