మనం ఎన్నో ఇన్సూరెన్స్ పాలసీలు చూస్తూ ఉంటాం.. కానీ ఇలాంటి ఇన్సూరెన్స్ పాలసీ ఎప్పుడు చూసి ఉండం. ఏంటి? అది ఏంటి అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.. అదేనండి.. మన ఈకామర్స్ సైట్ ఒకటి ఉంది కదా! అదే ఫ్లిప్‌కార్ట్. అలాంటి ఫ్లిప్ కార్ట్ సంస్ద తాజాగా ఏగాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకొని సామాన్యులకు మంచి మంచి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు అందిస్తోంది. ఆ పాలసీలు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

ఈ పాలసీలను 18 నుంచి 65 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు తీసుకోవక్ఛు. ఇవి టర్మ్ ప్లాన్స్ కాబట్టి సంవత్సరం వరకు చెల్లుబాటవుతాయి. ఫ్లిప్ కార్ట్ ఫ్లాట్ ఫామ్ ద్వారా ఈ పాలసీని పొందాలనుకునేవారు రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. పాలసీదారుడు ఏ కారణం వల్ల మరణించినా నామినీ ఇన్సూరెన్స్ డబ్బులను క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. 

 

లక్ష రూపాయల నుండి 40 లక్షల రూపాయల వరకు పాలసీలు అందుబాటులో ఉంటాయి. లక్ష రూపాయల కోసం 129 రూపాయలు, 40 లక్షల కోసం 5,129 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. పాలసీని బట్టి ప్రీమియం మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించే ప్రీమియంపై సెక్షన్ 80సి కింద పన్ను ప్రయోజనాలను పొందే అవకాశం కూడా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: