వర్క్ ఫ్రం హోమ్‌ అంటారు కానీ.. కనీసం ఒక గంట కూడా ఖాళీగా ఉండదు.. ఉదయం నుండి రాత్రి పడుకునే వరుకు వర్క్ చేసినట్టే ఉంటుంది అంటే నమ్మండి. నాకు తెలుసు మీకు నమ్మాలి అని అనిపించదు అని. కానీ నమ్మకతప్పదు.. ఎందుకంటే ఆఫీస్ లో ఉంటె కేవలం ఉదయం పది గంటల నుండి సాయింత్రం ఐదు లేదా ఆరు గంటల వరుకు మాత్రమే వర్క్ చేస్తాం. 

 

కానీ వర్క్‌ ఫ్రం హోమ్‌ అయితే బద్దకంగా ఉండటం వల్ల మెల్లగా చేసుకుంటూ ఉదయం నుండి సాయింత్రం వరుకు ఒకటే వర్క్ చేస్తారు అంటే నమ్మండి. సరే ఇప్పుడు అది అంత పక్కన పెడితే కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆఫీస్ లు చాలా వరుకు వర్క్‌ ఫ్రం హోమ్‌ కు అవకాశాలు ఇస్తున్నాయి. ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ కారణంగా అందరూ ఇంట్లోనే కూర్చొని ప్రపంచాన్ని చూసేస్తున్నారు. 

 

ఈ నేపధ్యంలోనే ఆలా ప్రపంచాన్ని చూడటానికి జియో ఓ సంచలన బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రపంచాన్ని చూడటానికి కేవలం 251 రూపాయితో మేము మీకు సహాయపడుతాం అని ఆఫర్ ఇచ్చారు. అది ఏంటి అంటే.. వర్క్‌ ఫ్రం హోమ్‌ ఆఫర్. ఈ ఆఫర్ ద్వారా రోజుకు 2జీబీ డేటా వినియోగించుకోవచ్చు. కాలపరిమితి 51 రోజులు. ధరను రూ.251గా నిర్ణయించింది 2జీబీ డేటా పరిమితి ముగిసిన తరవాత 64 కేబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌ను పొందొచ్చు. అయితే ఈ ఆఫర్ కు మెసేజ్, కాల్ ఆఫర్స్ లాంటివి లేవు. 

మరింత సమాచారం తెలుసుకోండి: