అయినా మా పిచ్చి కానీ.. పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్న కూడా బయటకు వెళ్తారా ఏంటి ? బయటకు వెళ్తే మిమ్మల్ని పోలీసులు జైల్లో వేస్తారు. మీ ఇష్టం ఇక.. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. ఈ కర్ఫ్యూ విధిస్తే ఎవరు బయటకు వెళ్ళకూడదు కూడా.. ఇంకా ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే పెట్రోల్ బంక్ లు అన్ని బంద్ చేశారు. 

 

అయినా సరే.. కొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బయటకు వస్తారు.. తిరుగుతారు.. ప్రభుత్వం చెప్పింది మేము వినాలా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తారు. అలాంటివారిని ఏమి చెయ్యలేం అనుకొండి,, అది వేరే విషయం.. ఇంకా ఈ నేపథ్యంలోనే ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయ్ అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

నేడు ఆదివారం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 73.97 రూపాయిల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. అలాగే లీటర్ డీజిల్ ధర 67.82 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. ఆర్ధిక రాజధాని అయినా ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర రూ.78.60 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర రూ.67.93 వద్ద స్థిరంగా కొనసాగుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: