భారత్ లోని వాహనదారులకు గుడ్ న్యూస్... రోజురోజుకి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం మొదటి నుంచి దేశీ ఇంధన ధరలు క్షీణిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం కరోనా వైరస్... దెబ్బకి అంతర్జాతీయ మార్కెట్‌ లో ముడి చమురు ధరలు తగ్గడం ముఖ్యమైన కారణంగా చెప్పుకోవచ్చు. ఈ ఏడాదిలో క్రూడ్ ధర ఏకంగా బ్యారెల్‌ కు ఏకంగా 30 డాలర్లు వడిపోయింది. దినితో పెట్రోల్, డీజిల్ ధరలను ఒకసారి గమనిస్తే జనవరి 11న ఏడాది గరిష్టానికి వచ్చాయి. 

 

 

 

దింతో అప్పట్లో ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.76 వద్దకు చేరింది. అలాగే నేను ఏమి తక్కువ కాదన్నట్టు డీజిల్ ధర కూడా రూ.69 పైనే ఇది ఉండేది. దీనితో అప్పటి నుంచి నేటి వరకు చూస్తే లీటరుకు పెట్రోల్ ధర రూ.6కు పైగా తగ్గింది. దింతో పాటుగా డీజిల్ ధర కూడా ఇదే స్థాయిలో పడిపోయింది. దీనితో క్రూడ్ ధరల పతనం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు మరింత తగ్గుతాయని అందరూ అనుకున్నారు. 

 

 


కాకపోతే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అందరికీ ఒకింత షాక్ ఇచ్చింది. ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని రూ.3 వరకు పెంచింది. ఈ దెబ్బతో కేంద్ర ప్రభుత్వానికి ఏకంగా రూ.39,000 కోట్లు అదనపు రాబడి వచ్చింది అనుకున్నారు. ఇవి ఇలా ఉంటే పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మార్పలు వస్తుంటాయి. కేంద్ర ప్రభుత్వాల వలన అంతర్జాతీయ మార్కెట్‌ లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను రోజురోజు సవరిస్తూ వస్తుంటాయి. దీనివల్లనే దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ధరలు ఉంటాయి. ఇందులో రాష్ట్ర సుంకాలు కూడా ప్రముఖ పాత్ర వహిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: